News September 30, 2024
వరద బాధితులకు తాడిపత్రికి చెందిన సంస్థ రూ.కోటి విరాళం
తాడిపత్రిలోని అర్జాస్ స్టీల్ ఎండీ శ్రీధర్ మూర్తి సీఎం చంద్రబాబునాయుడును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును అందజేశారు. అనంతపురం జిల్లాలో చేస్తున్న అభివృద్ధి, పెట్టుబడులు ఉద్యోగ కల్పన నైపుణ్య అభివృద్ధి గురించి సీఎంకు వివరించారు.
Similar News
News October 12, 2024
శ్రీ సాయి ఆరామంలో మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ..
శ్రీ సత్యసాయి జిల్లాలో మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి ఆరామంలో జరుగుతుందని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, మద్యం షాపులకు డిపాజిట్లు చెల్లించిన వారు ఎంపిక ప్రక్రియలో పాల్గొనవచ్చునన్నారు. అధికారుల సమక్షంలో ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు.
News October 12, 2024
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే 88852 89039కు సమాచారం ఇవ్వాలన్నారు.
News October 12, 2024
గ్యాంగ్ రేప్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి: సీపీఐ
చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లిలో బళ్లారి నుంచి ఉపాధి కోసం వచ్చిన కుటుంబంలోని వాచ్‌మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకుని శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ్ డిమాండ్ చేశారు. పొట్టకూటి కోసం వచ్చిన అత్త, కోడలిపై గ్యాంప్ రేప్‌నకు పాల్పడిన ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమన్నారు.