News September 20, 2024
వరద బాధితులకు నెల జీతం విరాళంగా ఇచ్చిన స్పీకర్
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయవాడ వరద బాధితులకు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం చెక్కును సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ సామర్థ్యానికి తగ్గట్టు సీఎం రిలీఫ్ ఫండ్కు సహాయం అందించాలని కోరారు. వరద ప్రాంత బాధితులకు ఆ నిధులు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
Similar News
News October 12, 2024
చివరి నిమిషంలో పరుగులు తీసిన ప్రయాణికులు
కొత్తవలస రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దసరా నేపథ్యంలో స్పెషల్ ట్రైన్లు వేసిన సంగతి తెలిసిందే. విశాఖ నుంచి అరకు వెళ్లాల్సిన ప్రత్యేక రైలుకు మచిలీపట్నం టూ విశాఖ బోర్డు ఉండడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. తాము ఎక్కాల్సిన ట్రైన్ కాదనుకొని వేచి చూస్తుండగా ప్లాట్ ఫామ్‌పై వ్యాపారాలు చేస్తున్న వారు అరకు రైలు అని చెప్పడంతో ట్రైన్ ఎక్కేందుకు పరుగులు తీశారు.
News October 12, 2024
విశాఖ: ఓపెన్ యూనివర్సిటీ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 3వ సంవత్సరం 6వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 27 కు వాయిదా వేసినట్లు డాక్టర్ విఎస్ కృష్ణ కళాశాల అధ్యయన కేంద్రం రీజినల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ తెలిపారు. ఈనెల 14న జరగాల్సిన పరీక్షలను నాక్ బృందం సందర్శన కారణంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి 27 నుంచి జరిగే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
News October 12, 2024
సింహాద్రి అప్పన్న జమ్మి వేట ఉత్సవానికి ఏర్పాట్లు
విజయదశమి సందర్భంగా ఈనెల 13న సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో జమ్మి వేట ఉత్సవం నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువన పూల తోటలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సింహాద్రి అప్పన్నను శ్రీరాముడిగా అలంకరించి సాయంత్రం పల్లకిలో కొండదిగువకి తీసుకువస్తారు. శమీ వృక్షానికి పూజ చేసి జమ్మి వేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల వరకే స్వామి దర్శనాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.