News September 18, 2024

వరద బాధితులకు బీ.టెక్ రవి సహాయం.. ఎంతంటే.!

image

విజయవాడ వరద బాధితులకు టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అండగా నిలిచారు. తన సొంత నిధులు రూ.6 లక్షలు విరాళంగా ప్రకటించారు. అలాగే పులివెందుల నాయకులు, కార్యకర్తల నుంచి మరో రూ.4 లక్షలు విరాళంగా వచ్చాయి. మొత్తం రూ.10 లక్షల చెక్కును రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుకు బీటెక్ రవి అందజేశారు.

Similar News

News January 5, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
* బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.14,050
* బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,926
* వెండి 10 గ్రాముల ధర: రూ.2450.

News January 4, 2026

కడప జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బోధనేతర సిబ్బంది అధ్యక్షుడు ఈయనే.!

image

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కడప జిల్లా భోధనేతర సిబ్బంది అధ్యక్షుడిగా హరిప్రసాద్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా శేఖర్, ట్రెజరర్‌గా రాజేశ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గంగాధర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలోని బోధ నేతర సిబ్బంది సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

News January 4, 2026

జాతీయస్థాయి అండర్-14 వాలీబాల్ పోటీలు.. ఏపీ టీం ఇదే.!

image

69వ జాతీయస్థాయి అండర్-14 బాలికల వాలీబాల్ పోటీలు జమ్మలమడుగులో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో ఏపీ టీం ఇదే.!
C. నవీన, R. మనస్వి, Y. నందిని, K. శ్యామలాదేవి, అవంతి, V. జాస్మిన్, P. లాస్య, M. అశ్వని, K. జెసికా, V. వందన, K. తేజస్వి, J. నాగూర్‌బి. కోచ్ ఎం. దేవిక, మేనేజర్‌గా బీవీ రమణయ్య వ్యవహరించనున్నారు. ఈ పోటీలకు జమ్మలమడుగులోని బాలికల ఇంటర్ కాలేజీ ఆతిథ్యం ఇవ్వనుంది.
>> ALL THE BEST TEAM AP