News September 18, 2024
వరద బాధితులకు బీ.టెక్ రవి సహాయం.. ఎంతంటే.!
విజయవాడ వరద బాధితులకు టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అండగా నిలిచారు. తన సొంత నిధులు రూ.6 లక్షలు విరాళంగా ప్రకటించారు. అలాగే పులివెందుల నాయకులు, కార్యకర్తల నుంచి మరో రూ.4 లక్షలు విరాళంగా వచ్చాయి. మొత్తం రూ.10 లక్షల చెక్కును రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుకు బీటెక్ రవి అందజేశారు.
Similar News
News October 10, 2024
కమలాపురం మాజీ MLA కుమార్తెపై చర్యలు..!
వైసీపీ నేత, కమలాపురం మాజీ MLA వీరశివారెడ్డి కుమార్తె వీర మృణాళినిదేవి దువ్వూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్నారు. 2023 ఆగస్టు 21 నుంచి 2024 ఫిబ్రవరి 19 వరకు ముద్దనూరు ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగారు. జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో ఆమె అక్రమంగా 57 రిజిస్ట్రేషన్లు చేయగా వీటిని కలెక్టర్ శివశంకర్ రద్దు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
News October 10, 2024
కడపలో వారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా
గంజాయి నిర్మూలనకు కడప జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో గంజాయి కట్టడికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. కడప నగరంలో గంజాయి తాగే ప్రాంతాల్ల ఇకపై డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టనున్నారు. ఇలా ఎవరైనా ఈ కెమెరా కంటపడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే నగరంలోని కొన్ని కొరియర్ ఆఫీసుల్లో పోలీసులు తనిఖీలు చేశారు.
News October 10, 2024
ఎగ్జిబిషన్‌లు సృజనాత్మక ఆలోచనలను చిగురింపజేస్తాయి: కడప కలెక్టర్
పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలు చిగురింపజేయడానికి స్పేస్ వీక్- 24 లాంటి ఎగ్జిబిషన్‌లు ఎంతో దోహదపడుతాయని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కడప నగర సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇస్రో, ఇతర విద్యా సంస్థలు నిర్వహించిన ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమానికి బుధవారం కలెక్టర్ హాజరయ్యారు. వివిధ అంశాలపై జరిగిన కాంపిటీషన్స్ విజేతలకు ఆయన జ్ఞాపికలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.