News September 27, 2024

వరద బాధితులకు శరవేగంగా పరిహారం అందించాం: మంత్రి లోకేశ్

image

విజయవాడ వరద బాధితులకు శరవేగంగా 15 రోజులలో రూ.602కోట్ల నష్టపరిహారం అందించామని మంత్రి లోకేశ్ గురువారం ట్వీట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 4 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బు జమచేశామని లోకేశ్ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మిచాంగ్ తుఫాన్ బాధితులకు పరిహారం ఇచ్చేందుకు 5 నెలలపైనే సమయం తీసుకుందని లోకేశ్ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.

Similar News

News November 24, 2024

బుడమేరుకు మళ్లీ గండ్లు.. అధికారుల స్పందన

image

బుడమేరుకు సెప్టెంబర్‌లో గండ్లు పడ్డ ప్రాంతంలో మళ్లీ గండ్లు పడ్డాయని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతుండగా.. వాటిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్‌లో స్పందించింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని తమ అధికారిక ఖాతాలో తాజాగా హెచ్చరించింది. ఈ తరహా పోస్టులతో ప్రజలలో అలజడి రేపుతున్నారని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

News November 24, 2024

విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

image

ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఏలూరు కాలువలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లిదండ్రులతో పాటు కాలువలో బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఈ క్రమంలో పిల్లలు కాలువలో దిగి ఆడుతూ లోతుకి వెళ్లారు. వారిని బయటకి తీసుకువచ్చే లోపు వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 24, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. రేపటితో ముగియనున్న గడువు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో వివిధ పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y20 నుంచి Y24 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 28 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారంలోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, ఫీజు పేమెంట్ వివరాలకై https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ కోరింది.