News September 4, 2024
వరద బాధితులను ఆదుకునేందుకు కడప పోలీసులు
రాష్ట్రంలో నెలకొన్న భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. వేలాదిమంది ప్రజలు వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న సంఘటనలూ చూస్తున్నాం. అందుకే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప జిల్లాకు చెందిన సీఐలు ఎస్సైలు, ఇతర సిబ్బంది వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా బందోబస్తుకు తరలి వెళ్లారు. బాధితులను ఆదుకునేందుకు NDRF సిబ్బందితో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Similar News
News September 17, 2024
కడప ఆర్మీ జవాన్ ఆకస్మిక మృతి
వేంపల్లి పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చల్లా.సుబ్బారావు ఆర్మీలో ఉద్యోగం చేస్తు మరణించినట్లు బంధువులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీలో 18 ఏళ్లుగా ఉద్యోగం చేసేవాడు. ఈనెల 15వ తేదీన అనారోగ్యంతో మరణించడంతో ఆయన మృతదేహాన్ని మంగళవారం వేంపల్లెకు తీసుకువచ్చారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య రేణుకా వారికి ఇద్దరు పిల్లలు హేమ,జగదీష్ కలరు. ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు.
News September 17, 2024
ఎన్ఎంసీకి సీఎం లేఖ రాయడం దుర్మార్గం: తులసి రెడ్డి
మౌలిక వసతులు, సిబ్బంది కొరత సాకులు చూపి పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లు వద్దని సీఎం లేఖ రాయడం దుర్మార్గమని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సగం ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కొరత ఉందన్నారు. ఆ మాత్రాన వీటిని మూసేస్తారా అని ప్రశ్నించారు. ఎన్ఎంసీకి అండర్ టేకింగ్ లెటర్ ఇచ్చి మెడికల్ కళాశాల ప్రారంభించాలని కోరారు.
News September 17, 2024
తొండూరు బ్రిడ్జిపై రెండు లారీలు ఢీ
తొండూరు బ్రిడ్జిపై అతివేగంగా వస్తున్న రెండు సిమెంట్ లారీలు వెనకనుంచి ఒకదానికొకటి ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న తొండూరు ఎస్సై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.