News September 5, 2024

వరద బాధితులను పరామర్శించిన మంత్రి పొంగులేటి

image

పాలేరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. వరదల వల్ల ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడారు. ఆందోళన చెందవద్దని అందరికీ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు రామ్ రెడ్డి, శ్రీ చరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 6, 2025

ఖమ్మం: ఎన్నికలు.. రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

image

ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ను పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సమక్షంలో పూర్తి చేశారు. కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. 192 గ్రామ పంచాయతీలకు, 1740 వార్డులకు గాను 1582 బృందాలు సిద్ధమయ్యాయి. నిబంధనల ప్రకారం 20% సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచారు.

News December 6, 2025

రెండో విడత ఎన్నికలు.. నేడు గుర్తులు కేటాయింపు.!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులకు ఆయా కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు ఈరోజు గుర్తులు కేటాయించనున్నారు. అటు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఇప్పటికే రెబల్స్ బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లను విత్ డ్రా చేయించే పనిలో నిమగమయ్యారు. కాగా గుర్తుల కేటాయింపు అనంతరం ఎన్నికల ప్రచారం ముమ్మరం కానుంది.

News December 6, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} నేడు ఖమ్మం, మధిర, చింతకాని మండలాల్లో పవర్ కట్
∆} నేడు ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ
∆} నేడు ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన