News September 5, 2024

వరద బాధితులను పరామర్శించిన మంత్రి పొంగులేటి

image

పాలేరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. వరదల వల్ల ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడారు. ఆందోళన చెందవద్దని అందరికీ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు రామ్ రెడ్డి, శ్రీ చరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 19, 2024

కూసుమంచి: పాలేరు పాత కాల్వకు సాగర్ నీరు విడుదల

image

పాలేరు ఎడమ కాలువ మరమ్మతులను ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ నెల 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు పాలేరు ఎడమ కాలువ గండి పడింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి వెంటనే ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేసి తాత్కాలిక మరమ్మతులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులను స్వయంగా పర్యవేక్షించారు. పాత కాల్వ పరిధిలోని 25వేల ఎకరాల ఆయకట్టు పంటలకు నీరు అందించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

News September 19, 2024

పినపాక: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని రావిగూడెం శివారులో ఓ చెట్ల పొదల మధ్య గుర్తుతెలియని మగ మృతదేహాన్ని స్థానికులు గమనించారు. మృతుడు గోదావరి వరదనీటిలో కొట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. విషయాన్ని పోలీసులకు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 19, 2024

కనుల పండువగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.