News September 25, 2024
వరద బాధితుల కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భారీ విరాళం

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరఫున వరద బాధితుల కోసం రూ.కోటి విలువ చేసే చెక్కును ఏసీఏ పాలకవర్గం సభ్యులు మంగళవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీశ్ బాబు, ఉపాధ్యక్షుడు వెంకట రమణ ప్రశాంత్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ డి.గౌర్ విష్ణు తేజ్లు విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం చెక్కును అందజేశారు.
Similar News
News October 26, 2025
విశాఖ కలెక్టరేట్లో రేపటి ‘పీజీఆర్ఎస్’ రద్దు: కలెక్టర్

‘మొంథా’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో, విశాఖ కలెక్టరేట్లో సోమవారం (అక్టోబర్ 27) జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. తుఫాను ముందస్తు చర్యల కోసం అధికారులు అందుబాటులో ఉండాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం PGRS యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 26, 2025
విశాఖ: నడిసంద్రంలో బిక్కుబిక్కుంటూ

విశాఖలోని జాలరిపేటకు చెందిన ఎల్లాజీ శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. శనివారం 8 బోట్ల సహాయంతో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. వేట సమయంలో తిరగబడిపోయిన తెప్పపై 40 గంటల పాటు నిలబడి ప్రాణాలు కాపాడుకున్నాడు. బిక్కుబిక్కుమంటూ ఉన్న ఎల్లాజీని కాకినాడ జిల్లా కంతంపేట మత్స్యకారులు గమనించి కాపాడారు. స్థానిక జేడి ఆఫీసుకి సమాచారం అందజేయండంతో విశాఖ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News October 26, 2025
మంత్రి సత్యకుమార్ విశాఖ పర్యటన రద్దు

ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ విశాఖ పర్యటన రద్దయింది. ఆదివారం రాత్రి విశాఖ చేరుకుని మూడు రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారని మొదట ప్రకటన జారీ చేశారు. అయితే మొంథా తుపాన్ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు.


