News September 25, 2024
వరద బాధితుల కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భారీ విరాళం
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరఫున వరద బాధితుల కోసం రూ.కోటి విలువ చేసే చెక్కును ఏసీఏ పాలకవర్గం సభ్యులు మంగళవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీశ్ బాబు, ఉపాధ్యక్షుడు వెంకట రమణ ప్రశాంత్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ డి.గౌర్ విష్ణు తేజ్‌లు విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం చెక్కును అందజేశారు.
Similar News
News October 4, 2024
మిస్సెస్ ఇండియా-2024గా విశాఖ మహిళ
మలేషియాలో జరిగిన గ్లామ్ ఆన్ మిస్సెస్ ఇండియా-2024 విజేతగా విశాఖకు చెందిన హేమలతా రెడ్డి నిలిచారు. 300 మంది పాల్గొన్న ఈ పోటీల్లో విజేతగా నిలిచి విశాఖ ఖ్యాతిని పెంచారు. ఆమె ఇంతకముందు యాంకర్‌గా పనిచేశారు. త్వరలో పారిస్ ఫ్యాషన్ వీక్‌కి కూడా వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హేమలతా రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, పలువురు పాత్రికేయులు సత్కరించారు.
News October 4, 2024
యలమంచిలి: రూ.100 కోసం బ్లేడ్‌తో దాడి
అప్పుగా ఇచ్చిన రూ.100 కోసం ఓ వ్యక్తిపై పదునైన బ్లేడ్‌తో దాడి చేశాడు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొత్తలిలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నూకిరెడ్డి శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన బంగారి వెంకటరమణకు రూ.100 అప్పుగా ఇచ్చాడు. డబ్బు ఇవ్వాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత రామాలయం వద్ద కూర్చున్న శ్రీనివాస్‌పై వెంకటరమణ బ్లేడ్‌తో దాడి చేశాడు.
News October 4, 2024
విశాఖ: ఆకాశాన్ని అంటుతున్న టమాటా ధరలు
టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో రూ.80 కాగా, రైతు బజార్లలో రూ.66కి విక్రయిస్తున్నారు. రాయితీపై టమాటాను విక్రయించాలని విశాఖ నగర ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వారం రోజుల కిందట కిలో టమాటా ధర రూ.66 ఉండగా అదనంగా రూ.22 పెరిగింది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు టమాటా జోలికి వెళ్లటం లేదు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం వల్లే ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.