News September 12, 2024
వరద రాజకీయాలు ఎందుకు?: జడ్పి చైర్పర్సన్
ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓదార్చి ఆదుకోవడం బాధ్యత అని విశాఖ జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర అన్నారు. విశాఖ జడ్పీ అతిథి గృహంలో ఆమె మాట్లాడుతూ కూటమి నాయకులు ఆ బాధ్యతలను విస్మరించి వరద రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి చింతపల్లిలో చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
Similar News
News October 14, 2024
విశాఖలో రూ.13 కోట్ల మద్యం విక్రయాలు
విజయదశమి సందర్భంగా ఆదివారం ఒక్కరోజు విశాఖ జిల్లాలో రూ.13 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జిల్లాలో 139 ప్రభుత్వం మద్యం దుకాణాలతో పాటు 132 బార్‌లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు స్వల్పంగానే పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మద్యం దుకాణాల్లో తగినంత స్టాక్ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
News October 14, 2024
విశాఖ: 150 మద్యం షాపులకు 4139 దరఖాస్తులు
విశాఖ జిల్లాలో 150 మద్యం షాపులకు 4139 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈనెల 14 ఉదయం 8 గంటల నుంచి వుడా చిల్డ్రన్ ఎరీనాలో మద్యం షాపుల కేటాయింపుకు జరిగే లాటరీ ప్రక్రియ ఏర్పాట్లను ఆయన ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దరఖాస్తులు అధికంగా రావడంతో ఎక్కువమంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇందుకు తగ్గట్టుగా ఎక్కువ కౌంటర్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News October 13, 2024
అల్లూరి: భార్యను నరికి చంపిన భర్త
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త నరికి చంపిన ఘటన నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మఠం గన్నేరుపుట్టులో జరిగింది. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోని ఓ ఇంట్లో మధ్యాహ్నం భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త ఆమెను కత్తితో నరికి పరారయ్యాడు. దంపతులు పని కోసం ఒడిశా నుంచి వచ్చినట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.