News September 4, 2024
వరద సాయం కోసం BRS ప్రజాప్రతినిధుల నెల జీతం: MP వద్దిరాజు

వరద విపత్తులో ఉన్న ఖమ్మం ప్రజానీకానికి అండగా ఉంటామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఒక నెల జీతాన్ని వరద సాయం కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులందరి ఒక నెల జీతాన్ని వరద సహాయనిధి అకౌంట్కు జమ చేస్తామన్నారు. కష్టాల్లో ఉన్న ఖమ్మం ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు.
Similar News
News November 28, 2025
ఖమ్మం: ఫిలాటెలీ ఎగ్జిబిషన్-2025 ప్రారంభం

ఖమ్మం నగరంలోని DPRC భవనంలో జిల్లా స్థాయి ఫిలాటెలీ (పోస్టల్ స్టాంపుల సేకరణ) ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన రెండు రోజుల పాటు జరుగుతుంది. కలెక్టర్ మాట్లాడుతూ.. అభిరుచులు (హాబీలు), వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడతాయని తెలిపారు. ఎగ్జిబిషన్ అనంతరం, కలెక్టర్ పోస్టల్ బీమా పరిహారం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
News November 28, 2025
ఖమ్మం: 15 మంది నోడల్ అధికారుల నియామకం

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను 13 విభాగాలుగా విభజించి 15 మంది నోడల్ అధికారులను నియమించారు. వీరందరికీ గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ఎన్నికల కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు గాను వీరిని నియమిస్తూ ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 15 మంది ఒక్కో రకమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
News November 28, 2025
ఖమ్మం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం!

ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంది. తాజా ఓటర్ల వివరాల ప్రకారం నేలకొండపల్లిలో అత్యధికంగా 2,150 మంది మహిళా ఓటర్లు అదనంగా ఉన్నారు. రఘునాథపాలెం 1,946, కూసుమంచి 1,645, చింతకాని 1,733, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, ఏరుపాలెం, తల్లాడ, బోనకల్, పెనుబల్లి, కొణిజర్ల, సింగరేణి వంటి మొత్తం 12 మండలాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే 1,000కి పైగా అధికంగా ఉన్నారు.


