News September 4, 2024
వరద సాయం కోసం BRS ప్రజాప్రతినిధుల నెల జీతం: MP వద్దిరాజు
వరద విపత్తులో ఉన్న ఖమ్మం ప్రజానీకానికి అండగా ఉంటామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఒక నెల జీతాన్ని వరద సాయం కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులందరి ఒక నెల జీతాన్ని వరద సహాయనిధి అకౌంట్‌కు జమ చేస్తామన్నారు. కష్టాల్లో ఉన్న ఖమ్మం ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు.
Similar News
News September 12, 2024
గణేష్ నిమజ్జనానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు: CP
ఖమ్మం: గణేష్ నిమజ్జన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఖచ్చితమైన ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సునీల్ దత్ తెలిపారు. గణేష్ నిమజ్జనం, బందోబస్తు ఏర్పాట్లపై గురువారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ చిన్న సంఘటనకు అస్కారం లేకుండా భక్తులు, సందర్శకులు క్షేమంగా తిరిగి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని, అటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
News September 12, 2024
మున్నేరు ముంపును పరిశీలించిన కేంద్ర బృందం
ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజీవ్ గృహ కల్పలో వరద ముంపు ప్రాంతాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. అన్ని శాఖల అధికారులు నివేదికను కోరారు. కేంద్ర బృందం అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉన్నారు.
News September 12, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
> నేడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంపీ పర్యటన
> కూనవరంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
> వైరాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
> ప్రశాంతంగా జరుగుతున్న గణేశ్ ఉత్సవాలు
> మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు
> తగ్గుముఖం పట్టిన గోదావరి
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు