News March 12, 2025

వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో కాంస్యంతో మెరిసిన లలిత

image

విజయనగరం ఉడా కాలనీకి చెందిన క్రీడాకారిణి కిల్లకి లలిత వరల్డ్ పారా అథెటిక్స్‌లో మెరిసింది. న్యూఢిల్లీ వేదికగా ప్రారంభమైన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 పోటీల్లో తొలిరోజు టీ-11 విభాగం 1,500 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. లలిత జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ ప్రతినిధులు, తోటి క్రీడాకారులు అభినందించారు.

Similar News

News March 18, 2025

భోగాపురంలో బాంబు పేలి కార్మికుడి మృతి

image

భోగాపురంలో రాళ్లను పేల్చేందుకు ఏర్పాటు చేసిన బాంబు పేలి కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో భాగంగా రహదారి ఏర్పాటుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించే క్రమంలో బాంబులు పెడుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రామచంద్రపేటకు చెందిన కార్మికుడు కొత్తయ్య మృతి చెందాడు.

News March 18, 2025

VZM: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

విజయనగరం జిల్లా బాడంగి మండలంలో కరెంట్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. వేపాడ మండలం డబ్బిరాజు పేటకు చెందిన రామ్‌కుమార్ బొత్సవాని పాలెంలోని బెల్లం క్రషర్‌ వద్ద పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం సామగ్రిని వ్యాన్‌లోకి ఎక్కిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ప్రమాదంలో రామ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాడంగి సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

News March 18, 2025

విజయనగరం: మహిళలు శక్తి యాప్‌ను తప్పనిసరిగా వాడాలి

image

రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం ఏర్పాటుచేసిన శక్తి యాప్ ప్రతి ఒక్క మహిళలు తమ ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..శక్తి యాప్ మహిళల నివాసం, కార్యాలయం, ప్రయాణంలో రక్షణ కల్పించేలా రూపొందించింది పడిందని, ఈ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలకు భద్రత కొత్తదారులు తెరుచుకున్నాయని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!