News January 2, 2025
వరాహ అవతారంలో భద్రాద్రి రామయ్య
దక్షిణాది అయోధ్య భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా మూడో రోజు గురువారం వరాహ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మహానివేదన అనంతరం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహిస్తారు. నృత్యాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో విహరిస్తారు. ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి, ఆలయ అధికారులు,భక్తులు పాల్గొన్నారు.
Similar News
News January 22, 2025
KMM: పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ
ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామ పంచాయతీలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభలను సీపీ సునీల్ దత్ పర్యవేక్షించారు. కాగా అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను సీపీ పర్యవేక్షించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News January 21, 2025
ఖమ్మం: గ్రామసభ ఏర్పాట్లు పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమైన నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని గ్రామాల్లో శాంతిభద్రతలకు సమస్య తలెత్తకుండా ఏర్పాటుచేసిన బందోబస్తును సీపీ సునీల్ దత్ పర్యవేక్షించారు. ఖమ్మం మంచుకొండ, మధిర నాగులవంచ, పాలేరు మద్దులపల్లి గ్రామ సభలను సందర్శించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వుండాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
News January 21, 2025
‘కన్న కూతురిని చంపబోయాడు’
కన్న కూతురిని తండ్రి కడతేర్చాలని చూసిన ఘటన ఈ నెల 13న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. టేకులపల్లి మం. సంపత్ నగర్‌కు చెందిన కొర్స రవి-లక్ష్మి దంపతులు. రవి భార్యతో గొడవ పడుతూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన అతను కూతురికి చాక్లెట్స్ కొనిస్తానని పక్కనే ఉన్న జామాయిల్లోకి తీసుకెళ్లి చంపబోయాడు. ఇంటికి వచ్చి బాలిక విషయం తల్లికి చెప్పడంతో అమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.