News November 20, 2024
వరాహ పుష్కరిణి వద్ద పోలిపాడ్యమికి ఏర్పాట్లు
డిసెంబర్ 2న జరిగే పోలిపాడ్యమికి సింహాచలం వరాహ పుష్కరిణి వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం ఈవో త్రినాథరావు తెలిపారు. వరాహ పుష్కరిణిలో దీపాలు వదిలేందుకు మహిళలు ఎక్కువగా రానున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పుష్కరిణి వద్ద బారికేడింగ్ ఏర్పాట్లు చేశారు. పుష్కరిణికి మార్గంలో పోలీసులతోను బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తోలిపావంచ వద్ద ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేస్తామన్నారు.
Similar News
News December 9, 2024
అల్లూరి జిల్లాలో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి
పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లిలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు మృతి చెందారని ఎస్‌ఐ కే.రమణ తెలిపారు. గ్రామానికి చెందిన కొర్రా లక్ష్మి(36), ఆమె కుమారుడు సంతోష్(13), కుమార్తె అంజలి(10) ఇంటి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News December 9, 2024
విశాఖ-సికింద్రాబాద్ మధ్య సంక్రాంతికి స్పెషల్ ట్రైన్
సంక్రాంతి సీజన్ దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. సికింద్రాబాద్-విశాఖ(07097/07098) ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి ఈనెల 15, 22,29 తేదీల్లో నడపనున్నట్లు తెలిపారు. అలాగే విశాఖ-సికింద్రాబాద్(07097/07098) స్పెషల్ విశాఖ నుంచి 16, 23,30 తేదీల్లో నడుస్తాయన్నారు. >Share it
News December 9, 2024
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: బొత్స
తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైనట్లు MLC బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ నగరం లాసన్స్‌బే కాలనీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు పంట నష్టంపై వినతి పత్రం అందజేస్తామన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.