News August 17, 2024

వరికుంటపాడు: పిడుగుపాటుకు వ్యక్తి మృతి

image

వరికుంటపాడు మండలంలో శనివారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. జి కొత్తపల్లి గ్రామ సమీపంలో వరి నాటుతుండగా పిడుగు పడి కోటయ్య(47) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు ఒక భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Similar News

News September 16, 2024

మంత్రి నారాయణతో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ

image

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సానుకూలంగా స్పందించారని కోటంరెడ్డి తెలిపారు.

News September 16, 2024

మాజీ ఎంపీ మేకపాటి రూ.25 లక్షల సాయం

image

తెలంగాణ వరద బాధితులకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఈ మేరకు సోమవారం ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.25 లక్షల చెక్కును అందించారు. ఇటీవల వరదలతో ప్రజలు ఇబ్బందులకు గురవడంతో వారి సహాయార్థం సాయం అందించానన్నారు.

News September 16, 2024

నెల్లూరు: టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు

image

నెల్లూరు రూరల్ పరిధిలోని ఒకటో డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజ గౌడ్, రెండో డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ సోమవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు, వారందరికీ ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు