News January 19, 2025

వరికూటి అశోక్ బాబుకి కీలక పదవి

image

కొండపి నియోజకవర్గానికి చెందిన వరికూటి అశోక్ బాబుకు వైసీపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో కొండపి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం వేమూరు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అశోక్ బాబు నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Similar News

News February 13, 2025

చీమకుర్తి: ఫైరింగ్ సాధన ప్రక్రియలో జిల్లా ఎస్పీ

image

ఫైరింగ్ సాధన ప్రక్రియలో భాగంగా చీమకుర్తి నందు గల జిల్లా ఫైరింగ్ రేంజ్‌లో పోలీసు అధికారులకు నిర్వహించిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌ను గురువారం జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ సందర్శించి అక్కడ చేస్తున్న ఫైరింగ్ ప్రక్రియ గురించి అధికారులకు పలు సూచనలు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి అధికారులలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు.

News February 13, 2025

ప్రకాశం జిల్లా రైతులకు ముఖ్య సూచనలు

image

ప్రకాశం జిల్లాలోని రైతులు తమ భూముల వివరాలను ఈనెల 25వ తేదీలోగా ఆన్‌లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకం, ఫోన్ నంబర్ లింక్ అయి ఉన్న ఆధార్ కార్డుతో సచివాలయం రైతు సేవా కేంద్రాలకు వెళితే అగ్రికల్చర్ అసిస్టెంట్ రిజిస్టర్ చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 13, 2025

ఒంగోలు: ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తికి జైలు శిక్ష

image

లారీని అజాగ్రత్తగా నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తికి కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, రూ.10 వేల జరిమానాను విధించింది. ఈ మేరకు ఒంగోలు కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2019లో పోతవరం కుంట వద్ద ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ ఆదినారాయణను అరెస్ట్ చేసి హాజరు పరచగా కోర్టు తీర్పునిచ్చింది. సాక్ష్యాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

error: Content is protected !!