News December 24, 2024

వరిధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ వ్యాఖ్యలు

image

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లపై సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది 46 లక్షల మెట్రిక్ టన్నులేనని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్వింటాలుకు రూ.500 బోనస్ అని రైతులలో ఆశలు రేపి, దొడ్డు వడ్లకు తెడ్డు చూపి, సన్న వడ్లకు సవాలక్ష కొర్రీలు పెట్టారని రాసుకొచ్చారు.

Similar News

News December 26, 2024

రాహుల్‌ గాంధీకి ధన్యవాదాలు: మంత్రి పొన్నం

image

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో రవాణా, బీసీ సంక్షేమ శాఖలో చేపడుతున్న చర్యలు అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం (ఎక్స్) ద్వారా స్పందించారు. తెలంగాణ ప్రగతిని గుర్తించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. మీ మార్గదర్శకత్వం మాకు స్ఫూర్తినిస్తుంది అని ట్వీట్ చేశారు.

News December 25, 2024

KNR: BJP కొత్త సారథులు ఎవరు?

image

ఉమ్మడి KNRజిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి KNR, JGTL, SRCL, PDPL జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?

News December 25, 2024

హుజురాబాద్: ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి బలవర్మరణం

image

ప్రేమ పేరిట యువకుడి వేధింపులకు తట్టుకోలేక యువతి బలవర్మరణానికి పాల్పడిన ఘటన KNR జిల్లా HZB మం.లో జరిగింది. CI తిరుమల్ గౌడ్ వివరాలు.. ఇప్పల నర్సింగాపూర్‌కు చెందిన వరుణ్‌ప్రియ(18) అమ్మమ్మ ఊరైన పెద్ద పాపయ్యపల్లికి వచ్చి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కాగా, కూతురి మృతికి అదే గ్రామానికి చెందిన అజయ్(19) వేధింపులే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదయింది.