News January 23, 2026
వరిలో రాగి, బోరాన్ లోపాన్ని ఇలా గుర్తించండి

వరిలో రాగి సూక్ష్మపోషకం లోపిస్తే ఆకు చివర ఎండి, ఆకుపై ముతక ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. వెన్నులోని గింజలు చిన్నవిగా ఉంటాయి. రాగి లోప నివారణకు ఆకులపై ఒక లీటరు నీటిలో 1 గ్రాము కాపర్‌సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. బోరాన్ లోపిస్తే పంట లేత ఆకుల చివరలు మెలితిరిగి, వేర్లు వృద్ధి చెందవు. పంట ఎదుగుదల సరిగా ఉండదు. బోరాన్ లోప నివారణకు లీటరు నీటికి 1 గ్రాము బోరాక్స్ ద్రావణాన్ని కలిపి పంటపై పిచికారీ చేయాలి.
Similar News
News February 14, 2026
ఫిబ్రవరి 14: చరిత్రలో ఈరోజు

1898: స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం
1921: ఆంధ్రప్రదేశ్ రెండో సీఎం దామోదరం సంజీవయ్య జననం
1952: మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జననం
1983: తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం(ఫొటోలో)
1984: నటుడు సి.హెచ్. నారాయణరావు మరణం
2019: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల వీరమరణం
☛ ప్రేమికుల దినోత్సవం
News February 14, 2026
విజయ్ ర్యాలీలో కార్యకర్త మృతి.. అన్నాడీఎంకే సెటైర్

టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎన్నికల ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. సేలంలో సభ జరుగుతున్న సమయంలో గుండెపోటుతో ఓ కార్యకర్త కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై అన్నాడీఎంకే నేత సత్యన్ వ్యంగ్యంగా స్పందించారు. టీవీకే ర్యాలీకి వెళ్తే శవపేటిక పట్టుకెళ్లాలని ట్వీట్ చేశారు. అంతకుముందు కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన సంగతి తెలిసిందే.