News April 11, 2025
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర అందించాలని, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
మీకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో ఖాతా ఉందా?

AP: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం కొత్తగా IFSC కోడ్ UBIN0CG7999ను ఏర్పాటుచేసినట్లు తెలిపింది. దీనిద్వారానే NEFT/RTGS/IMPS/UPI సేవలను కొనసాగించుకోవచ్చని తెలిపింది. కాగా ఈ ఏడాది మే 1 నుంచి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులు విలీనమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా అవతరించిన విషయం తెలిసిందే.
News November 23, 2025
భీమ్‌గల్: 11 ఎకరాలను విరాళంగా ఇచ్చిన మహేశ్ గౌడ్

TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తన సొంత గ్రామమైన రహత్ నగర్‌పై దాతృత్వం చాటుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం తన 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు 10 ఎకరాలు, సబ్‌స్టేషన్‌కు 1 ఎకరాన్ని అందజేసి గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న దుర్గాదేవి నూతన ఆలయ భూమి పూజలో ఆయన పాల్గొన్నారు.
News November 23, 2025
తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ వంటల వారసత్వ వాక్

ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ టూరిజం ‘తెలంగాణ వంటల వారసత్వ వాక్’ను చార్మినార్‌లో ప్రారంభించింది. వంటకాల రుచి, తయారీ పద్ధతులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తెలంగాణ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి, ఫుడ్ స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వంటకాల రుచిని ఆస్వాదిస్తూ, వాటి వెనుక ఉన్న కథలను, చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది.


