News January 30, 2025
వరి ధాన్యం సేకరణలో KMR రెండో స్థానం: కలెక్టర్

వరి ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉందని జిల్లా కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో ఆయన బుధవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. గత మూడు, నాలుగు నెలల నుంచి జిల్లా యంత్రాంగం ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Similar News
News October 29, 2025
టుడే హెడ్‌లైన్స్

* AP: తీరాన్ని తాకిన మొంథా తుఫాను.. నెల్లూరులో 16.3 సెం.మీ. వర్షపాతం
* తుఫాన్ ప్రభావం.. రేపు ఉదయం వరకు 6 జిల్లాల్లో రాకపోకలు బంద్
* సినీ పరిశ్రమకు స్థలం, సినీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య: CM రేవంత్
* కనీస మద్దతు ధర ₹8110తో పత్తి కొనుగోలు: అచ్చెన్నాయుడు
* హరీశ్ రావు తండ్రి సత్యనారాయణరావు కన్నుమూత.. అంత్యక్రియలు పూర్తి
* రేవంత్‌ను ప్రజలు క్షమించరు: కవిత
* 8వ పే కమిషన్‌కు కేంద్రం ఆమోదం
News October 29, 2025
రేపే సెమీస్.. ఆ ట్రెండ్ బ్రేక్ చేస్తారా?

ICC టోర్నీల్లో అన్‌లక్కీయెస్ట్ టీమ్‌గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికా మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. రేపు WWC తొలి సెమీస్‌లో ENGతో తలపడనుంది. గెలిస్తే వన్డే WC చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరనుంది. SA మెన్స్&ఉమెన్స్ టీమ్స్ ఎంత పటిష్ఠంగా ఉన్నా నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తాయి. ఈసారైనా ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తారేమో చూడాలి. ఈనెల 30న రెండో సెమీస్‌లో IND, AUS తలపడనున్నాయి.
News October 29, 2025
అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి రావద్దు: కర్నూలు కలెక్టర్

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మట్టిమిద్దెలలో నివాసం ఉండకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 08514 -293903కు ఫోన్ చేయాలని సూచించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో మరో 3రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.


