News February 5, 2025
వరి ధాన్యం సేకరణలో KMR రెండో స్థానం: కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టరేట్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ, చెల్లింపులు CMR సేకరణ, వచ్చే రబీ వరి ధాన్యం సేకరణ ఏర్పాట్ల పై సంబందిత అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. 424 కేంద్రాల ద్వారా 4.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. వరి ధాన్యం సేకరణలో కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు.
Similar News
News November 13, 2025
అల్ ఫలాహ్ వర్సిటీకి షాక్

ఉగ్ర మూలాలు బయటపడిన ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వర్సిటీపై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(AIU) చర్యలు తీసుకుంది. సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే లోగోను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కళాశాలకు గుర్తింపు ఉందంటూ వెబ్సైట్లో ప్రదర్శించినందుకు వర్సిటీకి న్యాక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీకి ఫండింగ్, డాక్టర్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది.
News November 13, 2025
MBNR: U-14 క్రికెట్.. 150 మంది హాజరు

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాలురకు క్రికెట్ ఎంపికలు MDCA స్టేడియంలో నిర్వహించారు. SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొత్తం 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైనా వారిని ఈ నెల 15న నారాయణపేటలో జరిగే ఎంపికలలో పంపిస్తామన్నారు. పీడీలు వేణుగోపాల్, అబ్దుల్లా, మోహినుద్దీన్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.
News November 13, 2025
విద్యుత్తు అధికారులు నిర్లక్ష్యంగా ఉండరాదు: CMD

ఒంగోలులోని విద్యుత్ భవన్లో APSPDCL సీఎండీ పుల్లారెడ్డి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్య ఘర్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, స్మార్ట్ మీటర్ల గురించి చర్చించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని అధికారులకు సూచించారు. జిల్లాలో సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు అధికంగా ఏర్పాటు చేసేలా ప్రతి అధికారి ఓ లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నారు.


