News January 30, 2025
వరి ధాన్యం సేకరణలో KMR రెండో స్థానం: కలెక్టర్

వరి ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉందని జిల్లా కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో ఆయన బుధవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. గత మూడు, నాలుగు నెలల నుంచి జిల్లా యంత్రాంగం ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Similar News
News February 11, 2025
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్… ఆ వాహనాలకు నో ఎంట్రీ

APలో బర్డ్‌ఫ్లూ వెలుగుచూడటంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రం నుంచి వస్తున్నకోళ్ల వాహనాలకు అనుమతి నిరాకరించింది. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 24చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తిరిగి పంపిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ పై పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించాలని పశుసంవర్ధక శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. ఏపీలో ఈవైరస్ సోకి వేలసంఖ్యలో కోళ్లు మృతిచెందిన సంగతి తెలిసిందే.
News February 11, 2025
సీఎం చంద్రబాబు ఆగ్రహం

AP: సచివాలయంలో నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశానికి ఆయన వచ్చిన 10 నిమిషాల తర్వాత మంత్రులు, అధికారులు తాపీగా రావడంతో సీబీఎన్ వారందరికీ క్లాస్ తీసుకున్నారు. సమయపాలన లేకపోవడమేంటని ప్రశ్నించారు. ఇక నుంచి ఇలాంటివి సహించేది లేదని తేల్చిచెప్పారు.
News February 11, 2025
ధర్మపురి: లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయం..

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,63,681 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు ద్వారా.. టికెట్ల విక్రయాలు- రూ.1,10,614, ప్రసాదాల అమ్మకాలు- రూ.35,445, అన్నదానం ద్వారా రూ.17,622లు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటన ద్వారా భక్తులకు తెలియజేశారు.