News February 23, 2025
వర్గల్: జాతీయ శిబిరానికి ఎంపికైన డిగ్రీ విద్యార్థిని

ఒడిశా విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమగ్రత శిబిరానికి వర్గల్ మహాత్మ బాపూలే మహిళా డిగ్రీ కళాశాలకు విద్యార్థిని వైష్ణవి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ భాస్కరరావు తెలిపారు. మార్చి 3 నుంచి 9 వరకు జరిగే జాతీయ సమగ్రత శిబిరానికి ఎంపిక కావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
సంగారెడ్డి: పోలీసులకు ఫిట్నెస్ కీలకం: ఎస్పీ

పోలీసులకు ఫిట్నెస్ కీలకమని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో వీక్లీ పరేడ్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల ఆరోగ్యం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
News November 22, 2025
మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.
News November 22, 2025
కృష్ణా: కార్యాలయ పరిసరాలు శుభ్రం చేసిన కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. కలెక్టర్తో పాటు డీపీఓ అరుణ, డీఆర్ఓ చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెత్తా చెదారాలను తొలగించారు. వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.


