News August 21, 2024

వర్గల్ నవోదయలో ప్రవేశాలు.. SEP 16 చివరి తేదీ

image

ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని వర్గల్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు వచ్చే ఏడాది జనవరి 16న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 16లోగా www.navodaya.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
SHARE IT..

Similar News

News July 11, 2025

మెదక్: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ల బడ్జెట్ విడుదల

image

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న గుడ్లకు బడ్జెట్ విడుదలైందని DEO రాధా కిషన్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. జిల్లాకు రూ.26,97,786 విడుదల చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే సంబంధించిన ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు.

News July 11, 2025

రాబోయే తరాల కోసం కృషి చేయాలి: డీఈవో

image

రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఈవో డాక్టర్ రాధా కిషన్ పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.

News July 11, 2025

MDK: ‘చదువుకోసం సైకిల్ తొక్కుతాం’

image

చదువు కోసం సైకిల్ తొక్కుతామని మెదక్ మండలంలోని ర్యాలమడుగు గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు అన్నారు. గ్రామానికి చెందిన సుమారు 20 మంది విద్యార్థులు తమ గ్రామానికి సుమారు 2 KM దూరంలో ఉన్న మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వారు ప్రతిరోజూ సైకిల్ పై పాఠశాలకు వెళ్లివస్తుంటారు. ఆటోలో వెళ్లాలంటే డబ్బులు కావాలని, చదువు కోసం కష్టమైనా సైకిల్ పైనే వెళ్తామన్నారు.