News March 10, 2025
వర్గల్: పెళ్లిలో డిజిటల్ కట్నాల చదివింపులు

పెళ్లిలో ఇంతకాలం పెళ్లికూతురు, పెళ్లికొడుకు కట్నాల చదివింపులు రాతపూర్వకంగా ఉండేవి. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం కొత్త ట్రెండ్ మొదలైంది. అంతా డిజిటలైజేషన్ కావడంతో వర్గల్ మండలం గౌరారంలో ఆదివారం జరిగిన ఒక వివాహ వేడుకలలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు తరపున చదివింపుల కార్యక్రమంలో ఫోన్పే స్కానర్ ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా చదివింపులు చేపట్టారు.
Similar News
News March 10, 2025
మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన ఎఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం ఆదేశించారు.
News March 10, 2025
MDK: సినిమాల్లోకి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమా రంగ ప్రవేశం చేయబోతున్నారు. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుని ‘ఏ వార్ ఆఫ్ లవ్ ‘ అనే ప్రేమ కథా చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే, ఆ మూవీకి సంబంధించి పోస్టర్ కూడా విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో చిత్రం రూపుదిద్దుకుంటుందని తెలిపారు.
News March 10, 2025
మెదక్: పరీక్షకు 5,529 విద్యార్థులు హాజరు

ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లీష్ సెకండ్ పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 5,640 విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 5,529 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 111 మంది వివిధ కారణాల వల్ల హాజరు కాలేదని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.