News March 5, 2025

వర్గల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

వర్గల్ మండలం నాచారం వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వర్గల్ గ్రామానికి చెందిన పసుల లింగం(45) ముదిరాజ్ మృతి చెందాడు. స్థానికుల ప్రకారం.. లింగం నాచారం నుంచి మజీద్ పల్లి వైపు వస్తుండగా కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. గాయాలైన అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News December 3, 2025

ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఆరు నుంచి 12 వారాల్లో బిడ్డ అవయవాలన్నీ ఏర్పడుతాయి. ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్‌రేలకు దూరంగా ఉండాలి. ఏ సమస్య అనిపించినా వైద్యులను సంప్రదించాలి. జ్వరం వచ్చినా, స్పాంటింగ్ కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జన్యుపరమైన సమస్యలుంటే తప్ప అబార్షన్‌ కాదు. కాబట్టి అన్ని పనులు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, పరిగెత్తడం మానేయాలని సూచిస్తున్నారు.

News December 3, 2025

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

image

ఏ గుడికి వెళ్లినా లడ్డూ, పులిహోరాలనే ప్రసాదాలుగా ఇస్తారు. కానీ గుజరాత్‌లోని రపుతానా(V)లో జీవికా మాతాజీ, తమిళనాడులోని పడప్పాయ్‌ దుర్గా పీఠం ఆలయాల్లో మాత్రం పిజ్జా, బర్గర్, పానీపురి, కూల్ డ్రింక్స్‌ను ప్రసాదంగా పంచుతారు. దేవతలకు కూడా వీటినే నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు ప్రస్తుత కాలంలో ఇష్టపడే ఆహారాన్ని దేవతలకు నివేదించి, వారికి సంతోషాన్ని పంచాలనే విభిన్న సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.

News December 3, 2025

చిత్తూరు జిల్లా చిన్నది అవుతుందనే..!

image

నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉంది. MLA భానుప్రకాశ్ సైతం ఇదే అంశంపై పోరాడారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. చిత్తూరు జిల్లాలో 31మండలాలు ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని 4 మండలాలను మదనపల్లె జిల్లాలో కలిపారు. నగరిలోని 3 మండలాలను తిరుపతిలో కలిపిస్తే 24 మండలాలతో చిత్తూరు జిల్లా చిన్నది అవుతుంది. అందుకే నగరి మండలాలను చిత్తూరు జిల్లాలోనే కొనసాగిస్తున్నారని సమాచారం.