News March 14, 2025

వర్గల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

image

వర్గల్ మండలం గౌరారం రాజీవ్ రహదారిపై ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌరారంలో నివాసం ఉంటున్న దుర్గాప్రసాద్ (28) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆర్వీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడు దుర్గాప్రసాద్‌కు భార్య, రెండు సంవత్సరాల కూతురు, రెండు నెలల బాబు ఉన్నారు.

Similar News

News March 14, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి టాప్ NEWS!

image

@జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు @ఇటిక్యాల లో వెంకటేశ్వరా స్వామి రథోత్సవం @గ్రూప్ -2,3 లో సత్తాచాటిన బీర్పూర్ యువకుడు @కోటిలింగాల సన్నిధిలో జిల్లా విద్యాధికారి పూజలు@గ్రూప్ 1,3 ఫలితాల్లో రాయికల్ అరవింద్ ప్రతిభ @ధర్మపురి నరసింహుడిని దర్శించుకున్న DEO@కొండగట్టులో 26వ గిరి ప్రదక్షణ @ధర్మపురి నృసింహుని ఆలయంలో భక్తుల రద్దీ

News March 14, 2025

NGKL: హోలీ పండుగ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

హోలీ పండుగ వేళ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెలుగొండకు చెందిన రమేశ్(38) స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై బుద్దారంగండి నుంచి బిజినేపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో శాయిన్‌ప‌ల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో రమేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు.

News March 14, 2025

‘జియో హాట్‌స్టార్’ కీలక నిర్ణయం.. వారికి షాక్?

image

జియో, స్టార్ నెట్‌వర్క్, కలర్స్ టీవీల ప్రోగ్రామ్స్‌ను చాలామంది యూట్యూబ్‌లో చూస్తుంటారు. వారికి ‘జియో హాట్‌స్టార్’ షాకివ్వనుంది. ఆ సంస్థ యూట్యూబ్‌లో ఉన్న కంటెంట్‌ను తొలగించనుందని ‘ది ఎకనమిక్ టైమ్స్’ ఓ కథనంలో తెలిపింది. దాని ప్రకారం.. తమ యాప్‌, శాటిలైట్ టీవీల్లో తప్ప వేరే ఏ స్ట్రీమింగ్ వేదికపైనా తమ కంటెంట్ రాకూడదని జియో హాట్‌స్టార్ భావిస్తోంది. యాప్‌లో చూడాలంటే పేమెంట్ చేయాల్సి ఉంటుందని సమాచారం.

error: Content is protected !!