News February 4, 2025
వర్గల్ విద్యాధరి క్షేత్రంలో ఉత్సవాలు విజయవంతం

ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు 50 వేలకు పైగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పదివేలకు పైగా భక్తులు పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 9, 2026
జెమినీ, చాట్GPTకి దీటుగా మన ‘సర్వం ఏఐ’!

AI దిగ్గజాలు గూగుల్ జెమినీ, చాట్GPTలకు మన కంపెనీ సవాలు విసురుతోంది. బెంగళూరు స్టార్టప్ ‘సర్వం ఏఐ’ రిలీజ్ చేసిన Sarvam Vision, Bulbul టూల్స్ సంచలనం రేపుతున్నాయి. వర్డ్ అక్యూరసీలో 87.3%, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్(OCR)లో 84.3%, ఎర్రర్ రేటులో 8.6%తో జెమినీ, చాట్GPT, ఆంథ్రోపిక్ క్లౌడ్ కన్నా ఎంతో మెరుగైన ప్రదర్శనను కనబరిచాయి. ప్రస్తుతం ఇవి టెక్ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
News February 9, 2026
సర్వం ఏఐ.. ఇంతకీ ఏంటిది?

సర్వం ఏఐ కంపెనీని 2023లో వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్ స్థాపించారు. హైఎండ్ క్లౌడ్ కంప్యూటర్ల కోసమే కాకుండా ఫోన్లు, స్థానిక భాషల కోసం దీన్ని రూపొందించారు. భారత భాషల్లోని క్లిష్టమైన డాక్యుమెంట్లనూ Sarvam Vision ఈజీగా చదివేస్తోంది. text-to-speech టూల్ ‘Bulbul’ 11 భారత భాషల్లో 32 వాయిస్‌లు అందిస్తోంది. చౌకగా, స్థానిక భాషలతో, స్క్రిప్టులను చదవడంలో మేలైన OCRతో ఇక్కడి సంస్థలను సర్వం ఏఐ ఆకర్షిస్తోంది.
News February 9, 2026
కరీంనగర్: పదవి కోసం అభ్యర్థుల తంటాలు

ఉమ్మడి KNR జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా పలు డివిజన్ల, వార్డుల్లో ఎక్కువ మంది పోటీలో ఉండటంతో, ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరోవైపు, ప్రచారంలో ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు ఎవరి వైపు మొగ్గుచూపుతారోనని అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


