News February 27, 2025

వర్గల్: వివాహేతర సంబంధంతో మహిళ హత్య

image

వర్గల్ మండలం అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ(40)తో అదే గ్రామానికి చెందిన బండ్ల చిన్న లక్ష్మయ్య మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈనెల 15న గజ్వేల్ పరిధిలోని కోమటిబండ అటవీ ప్రాంతంలోకి మహిళను తీసుకెళ్లి పురుగు మందు కలిపిన కల్లు తాగించాడు. ఆ తరువాత మెడకు చీరతో ఉరేసి చంపినట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి వివరాలను వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News November 14, 2025

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>కెనరా<<>> బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ 10 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు. డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై, NISM/NCFM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.canmoney.in/careers

News November 14, 2025

వేములవాడ రాజన్న దర్శనాలు.. UPDATE

image

వేములవాడ రాజన్న ఆలయంలో రెండు రోజుల క్రితం నుంచి దర్శనాలను నిలిపివేసిన అధికారులు భక్తులు ప్రవేశించకుండా ముందు భాగంలోని స్వాగత ద్వారం వద్ద రేకులను అమర్చిన విషయం తెలిసిందే. తాజాగా గేటు బయట నుంచి సైతం మరింత ఎత్తుగా అదనంగా రేకులను ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఆలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో గేటు ముందు రెండంచెల భద్రత తరహాలో ఇనుప రేకులను ఫిక్స్ చేశారు.

News November 14, 2025

అన్నమయ్య: బస్సు ప్రమాదంపై ఫారెస్ట్ అధికారుల విచారణ

image

అన్నమయ్య జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురికావడం తెలిసిందే. బెంగళూరు నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న వినాయక ట్రావెల్ బస్సు చిన్నమండ్యం, కేశాపురంలో ఓ బైక్, ఫారెస్ట్ చెక్‌పోస్టును ఢీ కొట్టింది. దానిని వెనుకే వస్తున్న బెంగళూరు-పొరుమామిళ్ల ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. కొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై మదనపల్లె సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసులు విచారిస్తున్నారు.