News March 9, 2025

వర్గల్: విషాదం.. తల్లి మందలించిందని విద్యార్థి సూసైడ్

image

తల్లి చదువుకోమని మందలించినందుకు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మండలం చౌదర్‌పల్లి ఉన్నత పాఠశాలలో 10 తరగతి చదువుతున్న విజయేందర్ రెడ్డి(16) గురువారం వారి పొలం వద్దకు వెళ్లాడు. దీంతో చదువుకోకుండా ఎందుకు తిరుగుతున్నావు అని తల్లి మందలించింది. దీంతో పురుగు మందు తాగిన విజయేందర్ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.

Similar News

News March 10, 2025

రేపు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం.. దిశానిర్దేశం చేయనున్న KCR

image

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతుంది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌ ఉభయ సభల సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం 1 గంటకు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.

News March 10, 2025

WGL: క్విటా మొక్కజొన్న ధర రూ.2,305

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు మక్కలు(బిల్టీ) క్వింటాకు రూ.2,305 ధర పలికింది. గతవారం రూ.2,400కు పైగా పలికిన మొక్కజొన్న ధర ఈవారం తగ్గడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. అలాగే చాలా రోజుల తర్వాత ఈరోజు మార్కెట్‌కు కొత్త పసుపు తరలిరాగా.. రూ.7,607 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోల్లు-అమ్మకాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News March 10, 2025

బెల్లంపల్లి: ‘చిన్నారుల చికిత్సకు రూ.32కోట్లు కావాలి’

image

తమ పిల్లలను కాపాడాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల కుమార్తె సహస్ర(1), కుమారుడు మహావీర్(4)లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫి (SMA) వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.16కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు తెలిపారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని.. ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

error: Content is protected !!