News March 10, 2025

వర్గల్: విషాదం.. తల్లి మందలించిందని విద్యార్థి సూసైడ్

image

తల్లి చదువుకోమని మందలించినందుకు విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం SI కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మం. చాంద్‌ఖాన్ మక్తాకు చెందిన విజయేందర్ రెడ్డి(15) చౌదర్‌పల్లి పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. విజయేందర్ గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లగా ఎందుకు తిరుగుతున్నావని తల్లి కనకవ్వ మందలించింది. దీంతో మనస్తాపంతో పురుగు మందు తగగా చికిత్స పొందుతూ అదివారం మృతి చెందాడు.

Similar News

News March 26, 2025

పాలమూరు: ‘మరమ్మతులు చేసి సాగునీరు అందించండి’

image

పాలమూరులోని తెల్లరాళ్లపల్లి తండా సమీపంలో కేఎల్ఐడీ 8 కాల్వ గండి పడింది. దీంతో సాగునీరు వృథాగా పోతోందని రైతులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేసి సాగునీరు అందించి పంటలను కాపాడాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేఎస్ఐ అధికారులను కోరితే తమ పరిధి కాదంటూ NGKL జిల్లా అధికారులు తమ పరిధి కాదంటూ WNP జిల్లా అధికారులు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారని వాపోయారు.

News March 26, 2025

అసెంబ్లీలో కేటీఆర్ కామెంట్స్‌తో దుమారం

image

TG: కాంగ్రెస్ పాలనలో పనులు కావాలంటే 30% కమీషన్లు తీసుకుంటున్నారని మాజీ మంత్రి KTR చేసిన కామెంట్స్ అసెంబ్లీలో దుమారం రేపాయి. సభలో ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని Dy.CM భట్టి విక్రమార్క డిమాండ్ చేయడంతో సభ మరింత హీట్ ఎక్కింది. పరస్పర కామెంట్లతో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. KTR వ్యాఖ్యలను సభాపతి రికార్డుల నుంచి తొలగించడంతో BRS సభ్యులు వాకౌట్ చేశారు.

News March 26, 2025

ఆ ఒక్క సలహా విఘ్నేశ్‌ జీవితాన్ని మార్చేసింది!

image

ముంబై స్పిన్నర్ విఘ్నేశ్ పుతుర్‌ గురించి అతని స్నేహితుడు మహమ్మద్ షరీఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ‘విఘ్నేశ్ మొదట్లో మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు. లెగ్ స్పిన్‌కు మారి నైపుణ్యం సాధిస్తే మేలు చేస్తుందని సూచించా. నేను ఆఫ్ స్పిన్నర్ కాబట్టి అతనికి కొన్ని టెక్నిక్స్ నేర్పించా. పుతుర్ టాలెంట్ చూసి క్రికెట్ క్యాంపులకు వెళ్లమని చెప్పా. ఇద్దరం కలిసి 2-3 ఏళ్లు క్యాంపులకు వెళ్లాం’ అని తెలిపారు.

error: Content is protected !!