News February 4, 2025
వర్గల్: 50 వేలకు పైగా దర్శించుకున్న భక్తులు

ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు 50 వేలకు పైగా అమ్మవారిని దర్శించుకున్నారు. వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పదివేలకు పైగా భక్తులు పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 27, 2026
కచ్చితమైన సమాచార సేకరణే లక్ష్యం: కలెక్టర్

పుట్టపర్తి సాంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం జనగణన 2027 శిక్షణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనగణనలో డేటా సేకరణ కోసం అత్యాధునిక సాంకేతికత వినియోగించడంపై అధికారులకు కలెక్టర్ పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా కచ్చితమైన డేటా సేకరించడమే ఈ శిక్షణ ఉద్దేశమన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతం చేయాలని తెలిపారు.
News February 27, 2026
సంగారెడ్డి: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించండి’

సంగారెడ్డి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా రోడ్డుపై పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
News February 27, 2026
ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ: కలెక్టర్

మార్చి 1 ఆదివారం సెలవు దినం కావడంతో ఫిబ్రవరి 28న ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందజేస్తారన్నారు. ఫిబ్రవరి నెలకు జిల్లాలో 2,77,073 మంది లబ్ధిదారులకు రూ.123.99 కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు. మొదటి రోజు పొందని వారు మార్చి 2న పింఛన్ పొందవచ్చన్నారు.


