News February 4, 2025

వర్గల్: 50 వేలకు పైగా దర్శించుకున్న భక్తులు

image

ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు 50 వేలకు పైగా అమ్మవారిని దర్శించుకున్నారు. వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పదివేలకు పైగా భక్తులు పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 15, 2025

నల్గొండ: నేడు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

image

నల్లగొండ పోలీస్ శాఖ, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం ఎన్జీ కళాశాలలో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. క్రీడాభిమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.

News February 15, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 15, 2025

నల్గొండ: తెలుగు, ప్రాచ్య భాషల పాఠ్యప్రణాళిక మండలి ఛైర్మన్‌గా బెల్లి యాదయ్య

image

MG యూనివర్సిటీ తెలుగు, ప్రాచ్య భాషల పాఠ్యప్రణాళిక మండలి ఛైర్మన్‌గా కవి, రచయిత, అసోసియేట్ ప్రొఫెసర్, నకిరేకల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.బెల్లి యాదయ్య నియమితులయ్యారు. ఈ మేరకు MG యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రెండేళ్ల పాటు బెల్లి యాదయ్య ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!