News December 12, 2024
వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక: ఛైర్మన్

ఖమ్మం: షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై స్వీకరించిన దరఖాస్తులన్నింటిని క్రోడీకరించి దానిపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని రాష్ట్ర ఎస్సీ ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ డా. షమీమ్ అక్తర్ తెలిపారు. గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్సీ కులాలు, కుల సంఘాలు, వ్యక్తులతో బహిరంగ విచారణ నిర్వహించారు. బహిరంగ విచారణలో 450 మంది వ్యక్తిగతంగా, కుల సంఘాల పరంగా దరఖాస్తులు సమర్పించారని పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
జైత్రం తండా సర్పంచ్గా జయంతి

సింగరేణి మండలంలోని జైత్రం తండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మూడ్ జయంతి విజయకేతనం ఎగురవేశారు. బుధవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఆమె తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన మెజారిటీతో ఘనవిజయం సాధించి సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. జయంతి విజయం సాధించడంతో తండాలో గులాబీ శ్రేణులు బాణసంచా కాల్చి, గిరిజన సాంప్రదాయ నృత్యాలతో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
News December 17, 2025
ఖమ్మం: తుది దశలో మొదటి సర్పంచిగా విజయం

కల్లూరు మండలంలో బుధవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తెలగారం గ్రామానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి యల్లమందల విజయలక్ష్మి విజయం సాధించారు. 49 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఆమె అనుచరులు స్థానికులు విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని, తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సూర్యకాంత ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
News December 17, 2025
ముగిసిన ‘పంచాయతీ’ సమరం.. ఫలితంపై ఉత్కంఠ

ఖమ్మం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కోలాహలం ముగిసింది. అభ్యర్థులు ఓటర్ల ప్రసన్నం కోసం మద్యం, మాంసం, బాండ్ పేపర్లతో హామీలిచ్చారు. హోరాహోరీ ప్రచారం తర్వాత పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే నెలకొంది. లక్షల్లో ఖర్చు చేసిన అభ్యర్థుల్లో గెలుపుపై గుబులు మొదలైంది. మరికొద్ది గంటల్లో గ్రామరథ సారధులు ఎవరో తేలిపోనుంది. విజయం ఎవరిని వరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


