News February 13, 2026
వర్ధన్నపేటలో హంగ్.. BRS 6, కాంగ్రెస్ 5

వర్ధన్నపేట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 12 వార్డులు ఉండగా BRS 6, కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు. కాగా మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 7 ఏ పార్టీ సాధించకపోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. దీంతో వర్ధన్నపేటలో ఏం జరుగుతుందోనని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
Similar News
News March 14, 2026
గ్యాస్ బుకింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సరికొత్త సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. వంటగ్యాస్ సరఫరాపై వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసగాళ్ల ఉచ్చులో పడవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త పద్ధతులతో ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారని, అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు.
News March 14, 2026
తూ.గో: గ్యాస్ వినియోగదారులకు కలెక్టర్ సూచనలు

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గ్యాస్ సరఫరా చేస్తున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గృహ అవసరాల వినియోగం, అత్యవసర సేవల కోసం ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయంపై సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, గ్యాస్ పంపిణీదారులతో జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News March 14, 2026
1.71 కోట్ల ORS ప్యాకెట్లు సిద్ధం: సత్యకుమార్

AP: సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ‘అవేర్ ప్లాట్‌ఫాం ద్వారా 4-5 రోజుల ముందుగానే ఉష్ణోగ్రతల అప్డేట్ ఇస్తాం. వడదెబ్బకు గురైతే తీసుకోవాల్సిన చర్యలు, సీజనల్ వ్యాధులపై మెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. 1.71Cr ORS ప్యాకెట్లను ఆస్పత్రులకు పంపాం. గర్భిణులు, వృద్ధులు, శిశువులు, కూలీలు, ట్రాఫిక్ పోలీసులకు వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తాం’ అని పేర్కొన్నారు.


