News February 1, 2025
వర్ధన్నపేట: ఏడో తరగతి బాలిక సూసైడ్

ఏడో తరగతి బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన నందిని(12) సంక్రాతి సెలవులకు ఇంటికి వచ్చి పాఠశాలకు వెళ్లకపోవడంతో గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లి శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
Similar News
News March 14, 2025
వరంగల్: నగర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మేయర్

హోలీ పండుగ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రత్యేకంగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను ఆనందంతో సంతోషంగా జరుపుకోవాలని మేయర్ ఆకాంక్షించారు.
News March 14, 2025
వరంగల్: హోలీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద జిల్లా ప్రజలకు హోలీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందర్నీ ఒకటి చేసే ఈ హోలీ పండుగ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషంతో వెలుగులో నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనంద ఉత్సాహాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని అన్నారు. సహజ రంగులను వినియోగిస్తూ సాంప్రదాయబద్ధంగా పోలి నిర్మించుకోవాలని కలెక్టర్ కోరారు.
News March 14, 2025
WGL: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

వరంగల్ల్లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI