News February 1, 2025

వర్ధన్నపేట: ఏడో తరగతి బాలిక సూసైడ్

image

ఏడో తరగతి బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన నందిని(12) సంక్రాతి సెలవులకు ఇంటికి వచ్చి పాఠశాలకు వెళ్లకపోవడంతో గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లి శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.

Similar News

News November 25, 2025

T20 WC: గ్రూపుల వారీగా జట్లు

image

టీ20 ప్రపంచకప్-2026లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. వాటిని 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్-Aలో భారత్, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, USA ఉన్నాయి. పై 4 గ్రూపుల్లో ఏది టఫ్‌గా ఉందో కామెంట్ చేయండి.
టీమ్ ఇండియా గ్రూప్ మ్యాచుల షెడ్యూల్ ఇలా:
*ఫిబ్రవరి 7న ముంబైలో USAతో, 12న ఢిల్లీలో నమీబియాతో, 15న కొలంబోలో పాకిస్థాన్‌తో, 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడనుంది.

News November 25, 2025

వరంగల్ జిల్లాలో 3 దశల్లో ఎన్నికలు

image

వరంగల్ జిల్లాలోని 317 పంచాయతీలకు 3 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశలో వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తిలోని 91 జీపీలకు, 2వ దశలో దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెంలోని 117 జీపీలకు, 3వ దశలో నర్సంపేట, ఖానాపూర్, చెన్నరావుపేట, నెక్కొండ మండలాల్లోని 109 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.

News November 25, 2025

బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు!

image

TG: గతంలో పంచాయతీ ఎన్నికల వెంటనే పరిషత్ ఎన్నికలు (MPTC, ZPTC) జరిగేవి. కానీ, ఈసారి పరిషత్ ఎన్నికలను కొంత ఆలస్యంగా నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోవడంతో ముందుగా సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచే అంశం తేలాక పరిషత్ ఎన్నికలు నిర్వహించనుంది.