News February 1, 2025
వర్ధన్నపేట: ఏడో తరగతి బాలిక సూసైడ్

ఏడో తరగతి బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన నందిని(12) సంక్రాతి సెలవులకు ఇంటికి వచ్చి పాఠశాలకు వెళ్లకపోవడంతో గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లి శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
Similar News
News December 2, 2025
కామారెడ్డి జిల్లా ఎన్నికల్లో పెరిగిన ఉత్సాహం!

కామారెడ్డి జిల్లాలో రెండో విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ ప్రక్రియలో భాగంగా, సోమవారం వరకు సర్పంచ్ స్థానాలకు 434 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు సభ్యుల స్థానాలకు 848 నామినేషన్లు దాఖలయ్యాయి. అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో, జిల్లాలో ఎన్నికల పోరు తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
News December 2, 2025
గొర్రెలకు సంపూర్ణ ఆహారం ఎలా అందుతుంది?

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.
News December 2, 2025
వరంగల్: గుర్తులు రెడీ.. నోటా టెన్షన్..!

జిల్లాలో పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఉపసంహరణ తర్వాతే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. సర్పంచ్ స్థానానికి 30, వార్డు సభ్యులకు 20కి పైగా గుర్తులు కేటాయించారు. సర్పంచ్కు గులాబీ బ్యాలెట్, వార్డు సభ్యులకు తెలుపు బ్యాలెట్ను నిర్ణయించారు. బ్యాలెట్లో నోటా చేరడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.


