News April 3, 2025
వర్ధన్నపేట: కనిపిస్తే ఫోన్ చేయండి

బుధవారం వర్ధన్నపేటలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద సినీ ఫక్కీలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. నందనం భారతమ్మ అనే వృద్ధురాలిని నమ్మించి ఓ వ్యక్తి రూ.3లక్షలు దోచుకెళ్లాడు. కాగా, నిందితుడి ఫోటోను వర్ధన్నపేట పోలీసులు విడుదల చేశారు. అతడి వివరాలు తెలిపితే రూ.10వేల నగదు ఇస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ రావు తెలిపారు.
Similar News
News April 12, 2025
హన్మకొండ: వడదెబ్బతో తాపీ మేస్త్రి మృతి

హన్మకొండ జిల్లా దామెర మండలంలో విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బతో తాపీ మేస్త్రీ మల్లేశం(46) మృతి చెందారు. ఓ ఇంటి దాబాపై పనిచేస్తున్న క్రమంలో వడదెబ్బ తగిలి మృతి చెందాడని మల్లేశం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI అశోక్ తెలిపారు. వేసవి దృష్ట్యా కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని SI సూచించారు
News April 12, 2025
వరంగల్: బేకరీల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు

గొర్రెకుంట, ఇతర ప్రాంతాల్లో పలు బేకరీలలో ఫుడ్ సేఫ్టీ, టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బేకరీలలో నాణ్యమైన పదార్థాలనే వినియోగదారులకు విక్రయించాలని సూచించారు. కుళ్లిన కోడిగుడ్లు, నాణ్యత లేని పదార్థాలను తయారీలో వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 12, 2025
జాబ్ మేళాలు ఎంతగానో ఉపయోగపడుతాయి: మంత్రి

నిరుద్యోగ సమస్యను పారద్రోలడానికి ఇలాంటి జాబ్ మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంత్రి కొండా సురేఖ నియామక పత్రాలను అందించారు. అధిక సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరై సంపూర్ణంగా వినియోగించుకోవడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు చెప్పారు.