News February 3, 2025

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కు మాతృవియోగం

image

వర్ధన్నపేట మాజీ MLA ఆరూరి రమేశ్ తల్లి వెంకటమ్మ మృతి చెందారు. సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జఫర్ గఢ్ మండలంలోని ఉప్పుగల్ గ్రామంలో మృతి చెందగా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె మృతి పట్ల పలు పార్టీలకు చెందిన నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News February 13, 2025

పోలీసులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలి: పీటీసీ ప్రిన్సిపల్

image

పోలీసులు విధి నిర్వహణలోని మంచి పేరు తెచ్చుకోవాలని మామునూర్ పీటీసీ ప్రిన్సిపల్ పూజ అన్నారు. బుధవారం మామునూర్ క్యాంప్‌లో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందిన 256 కానిస్టేబుళ్ల శిక్షణకు పూజ హాజరై మాట్లాడారు. శిక్షణ ద్వారా నేర్చుకున్న ప్రతి విషయం విధి నిర్వహణలో తోడ్పాటు కాగలదని, చెప్పారు. డీఎస్పీలు రమేష్, వేంకటేశ్వర రావు, రవీందర్, పాండునాయక్, పీఆర్‌ఓ రామాచారి పాల్గొన్నారు.

News February 12, 2025

ముగిసిన రెండో విడత ఇంటర్ ప్రయోగ పరీక్షలు

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 8 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రయోగ పరీక్షలు ఐదు రోజులు నిరాటంకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు వేళల్లో పరీక్షలు నిర్వహించారు.

News February 12, 2025

ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల రేటు పెంచాలి: DMHO

image

ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల రేటు పెంచాలని జిల్లా DMHO గోపాల్ రావు అన్నారు. గీసుగొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO తనిఖీ చేసి మాట్లాడారు.ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాలన్నారు. పల్లె దవాఖానలో పని చేసే డాక్టర్లు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

error: Content is protected !!