News January 11, 2026
వర్ధన్నపేట: NH-563పై మృత్యుశకటాలు

వర్ధన్నపేట శివారులోని కెనాల్ నుంచి మట్టి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. స్థానిక అవసరాల పేరుతో పర్మిషన్లు తెచ్చుకుని పదుల సంఖ్యలో లారీలతో వరంగల్‌కు మట్టిని తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. NH-563పై లారీలు అతివేగంతో దూసుకెళ్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అధికార పార్టీ నేత అండదండలతోనే దందా సాగుతోందని, అందుకే అధికారులు పట్టించకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News January 23, 2026
అనంతపురం ఎమ్మెల్యే అనుచరుడు గంగారాం అరెస్ట్?

అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరుడు గంగారాంను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడి, నంబూరి వైన్స్‌కు నిప్పు పెట్టిన ఘటనల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. కొన్నిరోజులు పరారీలో ఉన్న ఆయనను అనంతపురం పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
News January 23, 2026
పిఠాపురానికి జనసేనాని.. 3 రోజుల పాటు..

పిఠాపురం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ఆయన తన నియోజకవర్గంలోనే పర్యటించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సమస్యల పరిష్కారానికి ‘జనవాణి’ నిర్వహించడంతో పాటు, మంజూరైన నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా తనిఖీ చేయనున్నట్లు సమాచారం. పవన్ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
News January 23, 2026
ఉపాధి హామీ కింద 100 రోజుల పని తప్పనిసరి: VZM కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద ప్రతి వేతనదారునికి 100 రోజుల పని తప్పనిసరిగా కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి పనులు, కుటుంబ సర్వే, అక్షరాంధ్ర కార్యక్రమాలపై మండల వారీగా సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గృహ సర్వే ఫిబ్రవరి 10లోపు శతశాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు.


