News March 29, 2025

వర్మగారూ మీ వైఖరి మార్చుకోండి: ముద్రగడ క్రాంతి

image

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి పదవి రాకపోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణం కాదని ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అది టీడీపీ సొంత వ్యవహారమని, మీరూ మీరు తేల్చుకోవాలి కానీ జనసేనపై అక్కసు వెళ్లగక్కడం ఎంతమంత్రం తగదని ఆమె హెచ్చరించారు. మీరు వైసీపీలోకి వెళతారని, ఆ పార్టీ వాళ్లతో టచ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయన్నారు. ‘వర్మ గారు మీరు తీరు మార్చుకోండి’ అని ఆమె తెలిపారు.

Similar News

News April 3, 2025

తిరుపతి మార్గంలో తప్పిన పెనుప్రమాదం

image

భాకరాపేట ఘాట్ రోడ్డులో బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. కొంత మంది ప్రయాణికులతో మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సు తిరుపతికి బయల్దేరింది. ఘాట్ రోడ్డులోకి రాగానే బస్ బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. గమనించిన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేశారు. ఆ తర్వాత చాకచక్యంగా రోడ్డు పక్కన ఉన్న కొండను ఢీకొట్టారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణనష్టం తప్పింది.

News April 3, 2025

‘అమరావతి’కి తొలి విడత రుణం.. ఖాతాలో రూ.3,535 కోట్లు జమ

image

AP: రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు తొలి విడతలో రూ.3,535 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ నిధులు ఇవాళ ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. త్వరలోనే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు(ADB) నుంచీ తొలి విడత రుణం మంజూరవుతుందని ప్రభుత్వ పెద్దలు తెలిపారు. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ADB రూ.6,700 కోట్లు చొప్పున రుణం ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.1,400 కోట్లు ప్రత్యేక సాయంగా అందిస్తోంది.

News April 3, 2025

WGL: వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

image

హనుమకొండ పోస్టల్ కాలనీలో హైటెక్ వ్యభిచారం చేస్తున్న ఇంటిపై సుబేదారి పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్స్, రూ.2,450 నగదు స్వాధీనపరచుకున్నామని ఏసీపీ మధుసూదన్ తెలిపారు.

error: Content is protected !!