News April 13, 2025

వర్షంతో నష్టపోయిన రైతులకు సహాయం: మంత్రి తుమ్మల

image

ఆకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా పంట నష్టాలను ఎదుర్కొన్న రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించనున్నట్లు సమాచారం. గత నెలలో 8,408 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడించారు. నష్టపోయిన రైతుల వివరాలను సర్వే చేసి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.

Similar News

News April 17, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} కల్లూరులో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ ∆} నేలకొండపల్లిలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} పెనుబల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మంలో జాబ్ మేళా ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 17, 2025

KMM: ఆంబోతు మృతి.. ఆ ఊరంతా తల్లడిల్లింది.!

image

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని తాళ్లపెంటకు చెందిన దేవుడి ఆంబోతు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ ఊరంతా తల్లడిల్లింది. ఆ ఆంబోతును దేవుడి స్వరూపంగా భావిస్తూ గ్రామస్థులు ట్రాక్టర్‌పై వీధులలో మేళతాళాలు, కుంకుమ చల్లుతూ ఊరేగించారు. అనంతరం భక్తి శ్రద్దలతో సంప్రదాయబద్దంగా ఆంబోతుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. మహిళలు, పెద్దలు, గ్రామస్థులు పాల్గొని, కన్నీటి పర్యాంతమయ్యారు.

News April 17, 2025

ఖమ్మం: నేటి నుంచి భూభారతిపై అవగాహన సదస్సు

image

ఖమ్మం జిల్లాలో రైతులకు, ప్రజలకు భూ భారతి చట్టంపై ఈనెల 17 నుంచి 30 వరకు రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు 2 మండల కేంద్రాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలుపై సమగ్రంగా అధికారులు వివరిస్తారని, ప్రజలకు ఏలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చునని ఆమె సూచించారు.

error: Content is protected !!