News August 22, 2024
వర్షంలోనే అచ్యుతాపురానికి చేరుకున్న చంద్రబాబు
విశాఖ KGHలో క్షతగాత్రులు, చనిపోయిన కుటుంబాలను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత అచ్యుతాపురం సెజ్‌కు బయల్దేరారు. ఇదే సమయంలో వర్షం మొదలైంది. వానలోనే సీఎం ప్రమాదం జరిగిన ఎసెన్సియల్ కంపెనీ వద్దకు చేరుకున్నారు. పేలుడు ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ చంద్రబాబుకు వివరించారు.
Similar News
News September 18, 2024
భీమిలి: స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి
భీమిలి మండలం నారాయణరాజుపేట గ్రామంలో విషాదం నెలకొంది. రౌడి గ్రామంలోని నర్సరీ చదువుతున్న బి.వేణు తేజ(5) బస్సు దిగి వెనుక వైపు నిల్చున్నాడు. గమనించని డ్రైవర్ రివర్స్ చేయగా.. ఆ బాలుడు బస్సు వెనుక చక్రాల కింద పడి చనిపోయాడు. బస్సు ఆ చిన్నారి తలపై నుంచి వెళ్లిపోయింది. బస్సుకు క్లీనర్ లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
News September 18, 2024
విశాఖ: ‘పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు ఎన్.పి.ఎస్ వాత్సల్య’
పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్.పి.ఎస్ వాత్సల్య యోజన పథకం ఎంతో దోహదపడుతుందని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ అన్నారు. ఢిల్లీలో ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సాయంత్రం ప్రారంభించారు. సిరిపురం వద్ద ఎస్బీఐ పరిపాలన విభాగంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ పథకం దీర్ఘకాలంలో సంపదను సృష్టిస్తుందన్నారు.
News September 18, 2024
విశాఖ: పర్యాటక అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న అవార్డులు అందజేసేందుకు వీలుగా 2023- 24 సంవత్సరానికి అర్హులైన పర్యాటక రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. www.aptourism.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏపీ టూరిజం అథారిటీ, 5వ ఫ్లోర్, స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, విజయవాడ చిరునామాకు అందచేయాలన్నారు.