News March 23, 2025

వర్షం ఎఫెక్ట్..  RRలో తగ్గిన ఎండ తీవ్రత

image

రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత చాలా తగ్గింది. వర్షం నేపథ్యంలో జిల్లాలోని చుక్కాపూర్లో 37.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. కాసులాబాద్, చందనవెల్లి 37.6, మహేశ్వరం, మొగలిగిద్ద 37.5, రెడ్డిపల్లె 37.4, ప్రొద్దుటూరు 37.3, దండుమైలారం 37.1, కేతిరెడ్డిపల్లి 37.1, మొయినాబాద్ 36.8, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి, HYD విశ్వవిద్యాలయం 36.5, చంపాపేట్, గచ్చిబౌలి 36.4, అల్కాపురి 36.3, మంగళపల్లె 36.3℃ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News March 31, 2025

HYD: తల్లితో సంబంధం.. పొడిచి చంపిన కొడుకు

image

కర్మన్‌ఘాట్‌లో దారుణఘటన వెలుగుచూసింది. జానకి ఎన్‌క్లేవ్‌లో హత్య జరిగింది. స్థానికుల వివరాలు.. వెంకటేశ్వర్లుకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. గత 8 నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. సదరు మహిళ కుమారుడు పవన్‌కు వెంకటేశ్వర్లు మధ్య గత రాత్రి గొడవ జరిగింది. కోపంతో కత్తితో పొడిచిన పవన్ పరారీ అయ్యాడు. బాధితుడిని ఉస్మానియాకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News March 31, 2025

HYD: ‘స్మోకింగ్‌తో హృదయాన్ని హింసించవద్దు’

image

తెలుగు ప్రజల తొలి పండుగ ఉగాది సందర్భంగా పొగాకు, ధూమపానం అలవాట్లకు స్వస్తి పలకాలని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. స్మోకింగ్‌తో హృదయాన్ని హింసించ వద్దని ‘మాచన’ స్మోకర్స్‌ను కోరారు. పొగాకు ధూమపానం అలవాట్లు జీవితానికి చేదు అనుభవం మిగిలిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

News March 30, 2025

HYD: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 222 మంది చిక్కారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 222 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 163 ద్విచక్ర వాహనాలు, 9 త్రిచక్ర వాహనాలు, 48 నాలుగు చక్రాల వాహనాలు, 2 హెవీ వెహికిల్ వాహనాలు పట్టుబడ్డాయన్నారు. పట్టుబడ్డ వారందరినీ కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

error: Content is protected !!