News June 11, 2024
వర్షాకాలం శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి: సీతక్క

వర్షాకాలం శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల పై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా, అధిక వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News March 15, 2025
ఆదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో AI బోధన

ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రైమరీ పాఠశాలల్లో శనివారం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) బోధన ప్రారంభించనున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. తలమడుగు మండలం దేవాపూర్ ప్రైమరీ స్కూల్ తెలుగు, ఉర్దూ మీడియం, కోడద్ ప్రైమరీ స్కూల్, ఆదిలాబాద్ అర్బనులోని తాటిగూడ ప్రైమరీ పాఠశాలల్లో ఈ AI ప్రోగ్రాం ఉండనుందని వెల్లడించారు.
News March 15, 2025
ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం డీపీఓ కార్యాలయ సమీపంలో ఆటో, యాక్టివా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం అందించడంతో గాయాలైన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో యాక్టివా పైన ప్రయాణిస్తున్న ఇద్దరు 15 ఏళ్ల బాలురుల తో పాటు మరో వ్యక్తి శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
News March 15, 2025
ఆదిలాబాద్ జిల్లాలో కత్తి పోట్ల కలకలం

ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం గూడ రాంపూర్‌లో శుక్రవారం రాత్రి కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఒక వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన మరో వ్యక్తి కూడా కత్తి పోట్లకు గురయ్యాడు. ఇద్దరిని రిమ్స్‌కు తరలించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సాయినాథ్ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తాగిన మత్తులో ఘర్షణ జరిగినట్లు సమాచారం.