News July 19, 2024
వర్షాలపై విశాఖ వాతావరణ శాఖ UPDATE

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయం పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం పూరీకి తూర్పుఆగ్నేయంగా 70 కిలోమీటర్ల, కళింగపట్నానికి తూర్పుఈశాన్యంగా 240కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. తీరం దాటిన తర్వాత బలహీనపడి ఒడిశా, ఛత్తీస్గడ్ మీదుగా కొనసాగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడతాయని తెలిపారు.
Similar News
News October 31, 2025
విశాఖ: ‘ఫైన్లు ఈ విధంగా చెల్లించాలి’

రవాణా శాఖ, పోలీసు డిపార్టుమెంట్ వాహన తనిఖీలలో భాగంగా నమోదైన కేసులల్లో విధించిన ఫైన్లు చెల్లించాలని ఉప రవాణా కమిషనర్ ఆర్.సి.హెచ్.శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. తనిఖీలలో భాగంగా రాసిన కేసులను (https://echallan.parivahan.gov.in/) సైట్ ద్వారా చెల్లించాలన్నారు. రవాణా, రవాణేతర వాహనాల త్రైమాసం పన్నులు, ఇతర సేవలకై vahan.parivahan.gov.in చెల్లించవచ్చన్నారు.
News October 31, 2025
భాగస్వామ్య సదస్సు విజయవంతంపై కలెక్టర్ సమీక్ష

విశాఖలో ఈ నెల 14,15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. AU ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే ఈ సదస్సును అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని విజయవంతం చేయాలని ఆదేశించారు. నగర సుందరీకరణ, అతిథుల వసతి, భద్రత, రాకపోకలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News October 31, 2025
సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులు అర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం సిరిపురం జంక్షన్ వద్ద గల పటేల్ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.


