News July 20, 2024
వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

అధిక వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు, రైతులు, వాహనదారులు ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వరద ప్రవాహాల వద్దకు సెల్ఫీ కోసం వెళ్లి ప్రమాదాలకు బారిన పడవద్దని, అత్యవసర సమయంలో 100కు ఫోన్ చేసి సాయం పొందాలని, శిథిలావస్థకు వచ్చిన నివాసాల్లో ఉండవద్దని, చేపల వేటకు వెళ్లొద్దని, చెరువులు, వాగులు వద్దకు వెళ్లకూడదన్నారు.
Similar News
News December 7, 2025
మిర్యాలగూడ డివిజన్ పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

నల్గొండ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మిర్యాలగూడ డివిజన్లో విధులు నిర్వహించే సిబ్బంది ర్యాండమైజేషన్ను ఆదివారం జిల్లా పరిశీలకురాలు కొర్ర లక్ష్మి పర్యవేక్షణలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఛాంబర్లో నిర్వహించారు. డివిజన్లోని పది మండలాల్లో 2,418 పోలింగ్ కేంద్రాలకు సరిగ్గా 2,418 బృందాలను కేటాయించారు.
News December 7, 2025
NLG: స్థానిక పోరు.. కూలీలు లేరు..!

స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం నల్గొండ జిల్లాలో జోరందుకుంది. అభ్యర్థులు, వారి బంధువులు, సమర్థకులు ప్రచారంలో నిమగ్నం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత తీవ్రమైంది. ఫలితంగా, ప్రస్తుతం యాసంగి సాగు పనులు చేపడుతున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరకక పోవడంతో పొలాల్లో పనులు ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News December 7, 2025
నల్గొండ: మహిళలకు ఫ్రీ ట్రైనింగ్

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో టైలరింగ్, కంప్యూటర్ కోర్సులో ఉచిత శిక్షణకు ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని మహిళా శిశు వికాస కేంద్రం మేనేజర్ ఎ.అనిత తెలిపారు. అర్హత, పూర్తి వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


